: పీవీకి 'భారతరత్న'... ఇరవయ్యారు మందికి 'పద్మ' పురస్కారాలివ్వండి: తెలంగాణ ప్రభుత్వం


మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు 'భారతరత్న' అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు లేఖను రాసింది. అలాగే పలు విశిష్ట సేవలు అందించిన 26 మంది ప్రముఖులకు ప్రతిష్ఠాత్మకమైన 'పద్మశ్రీ', 'పద్మభూషన్', 'పద్మవిభూషణ్' అవార్డులను అందజేయాలని సూచించింది. ప్రొఫెసర్ జయశంకర్ కు పద్మ విభూషణ్ అవార్డు, ఇగ్నో తొలి వీసీ ప్రొఫెసర్ జీ.రామిరెడ్డికి పద్మ భూషణ్ అవార్డు అంజేయాలని సూచించింది. అలాగే డాక్టర్ ఎన్.గోపి, చుక్కా రామయ్య, మిథాలీ రాజ్, సుద్దాల అశోక్ తేజలకు కూడా అవార్డులు ఇవ్వాలని సూచించింది.

  • Loading...

More Telugu News