: రెండోసారి పెళ్లికొడుకవుతున్న ఇమ్రాన్ ఖాన్


పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లికి సిద్ధపడుతున్నారు. 2004లో తన మొదటి భార్య జెమీమా ఖాన్ కు విడాకులు ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్, అప్పటి నుంచి తన కంటే 20 ఏళ్లు చిన్నదైన బీబీసీ న్యూస్ యాంకర్ రెహాం ఖాన్ తో సహజీవనం చేస్తున్నారు. గత వారం ఇంగ్లండ్ లోని ఓ ప్రార్ధనా మందిరంలో వీరి నిఖా జరగగా, దానిని ఇమ్రాన్ ధ్రువీకరించారు. పాకిస్థాన్ లో కీలక నేతైన ఇమ్రాన్ స్వదేశంలో మద్దతుదారుల సమక్షంలో వివాహం చేసుకోవాలని భావించడంతో, ఆయన నివాసంలో మరోసారి వివాహ వేడుక జరుగనుంది. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ రెండోసారి పెళ్లి కొడుకయ్యారు.

  • Loading...

More Telugu News