: రేప్ కేసులో జైలుకెళ్లిన బంగ్లాదేశ్ ప్రపంచకప్ క్రికెటర్!


ఆస్ట్రేలియా-న్యూజిలాండులో జరగనున్న 2015 ప్రపంచకప్ క్రికెట్ లో ఆటగాడిగా ఎంపికైన ఓ క్రికెటర్ రేప్ కేసులో ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్ పై బంగ్లానటి నజీన్ అక్తర్ అత్యాచార కేసు నమోదు చేసింది. రూబెల్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రూబెన్ కోర్టుకి వెళ్లగా డిసెంబర్ 15న నాలుగు వారాల ముందస్తు బెయిల్ ఇచ్చారు. ఆ గడువు ముగుస్తుండడంతో మేజిస్ట్రేట్ ముందు ఈ రోజు లొంగిపోయాడు. దీంతో న్యాయమూర్తి అతనిని జైలుకి పంపారు. తదుపరి విచారణ వరకు అతనిని జైలులోనే ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నెల 24న బంగ్లాదేశ్ జట్టు పయనం కానుంది. దీంతో, ఈ నెల 24 లోపు సమస్య పరిష్కారం కాని పక్షంలో అతని ప్రపంచ కప్ కల నీరుగారిపోనుంది.

  • Loading...

More Telugu News