: తెలంగాణలో ట్రాఫిక్ జరిమానా వసూలు చేసేందుకు కొత్త పద్ధతి
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల నుంచి జరిమానా వసూలు చేసేందుకు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి జంట కమిషనరేట్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఈ-చలాన్ నేటి నుంచి అమల్లోకి వస్తుంది. ఇకపై వాహనదారుల నుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేయరని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ-చలానా ద్వారానే జరిమానా చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. వాహనదారులు క్రెడిట్, డెబిట్ కార్డులు, బ్యాంకు, ఈ-సేవ, మీ-సేవ ద్వారా చెల్లింపులు జరపవచ్చని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి పేర్కొన్నారు. ఈ విధానాన్ని త్వరలోనే 9 జిల్లాలకు విస్తరిస్తామన్నారు.