: లంచం ఇస్తానని అన్నందుకు దుబాయిలో భారతీయుడికి మూడేళ్ల జైలు శిక్ష
లంచం ఇవ్వచూపిన నేరానికి ఓ భారతీయుడికి దుబాయి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తన కుటుంబ సభ్యులకు వీసా కోసం యూఏఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నేచురలైజేషన్ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జీడీఎన్ఎఫ్) అధికారికి 10 వేల దిర్హామ్ లు (సుమారు రూ.1.72 లక్షలు) లంచం ఆఫర్ చేసినందుకు ఈ శిక్ష పడింది. నిందితుడి వయసు 43 ఏళ్లు అని, అతడి పేరును కోర్టు బహిరంగంగా వెల్లడించలేదని, పొడి అక్షరాల్లో అతని పేరు ఏఎన్ఎన్ అని స్థానిక మీడియా తెలిపింది. శిక్ష ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలని కోర్టు అతడిని ఆదేశించింది.