: హైదరాబాదులో ఇంజినీరింగ్ కళాశాలలపై కేసు


హైదరాబాదులోని నాలుగు ఇంజినీరింగ్ కళాశాలలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్థులు, ప్రభుత్వాన్ని మోసం చేశారన్న కారణంగా కేసులు పెట్టినట్టు జేఎన్టీయూ-హెచ్ రిజిస్ట్రార్ తెలిపారు. కృష్టమూర్తి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రిన్స్ టన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సిద్ధార్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ తనిఖీలకు వచ్చినప్పుడు నకిలీ విద్యార్థులను, లెక్చరర్లను చూపించినట్టు కళాశాలలపై అభియోగం మోపారు.

  • Loading...

More Telugu News