: ఆరు వేల కోట్ల రూపాయల భరణాన్ని తిరస్కరించిన మహిళ
తన భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ భరణంగా వచ్చిన 975 మిలియన్ డాలర్లను (సుమారు రూ.6,162 కోట్లు) తిరస్కరించింది. వివరాల్లోకి వెళితే... అమెరికాలో చమురు చక్రవర్తిగా పేరున్న హెరాల్డో హమ్ 26 ఏళ్ల క్రితం సూ యాన్ ఆర్నాల్ ను వివాహం చేసుకున్నాడు. గత నవంబర్ లో విడాకులు తీసుకున్న తరువాత ఆమెకు భరణంగా బిలియన్ డాలర్లు ఇవ్వాలని కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పు తరువాత, ముడి చమురు ధరల పతనం కారణంగా తన సంపద తరిగిందని చెబుతూ, 975 మిలియన్ డాలర్ల చెక్ ను ఆయన పంపాడు. ఆయన మొత్తం ఆస్తుల్లో తనకు వాటా కింద 18 బిలియన్ డాలర్లు రావాలంటున్న ఆర్నాల్ ఆ చెక్ ను వెనక్కు ఇచ్చి, మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతోంది. కాగా, నార్త్ డకోటాలో బయటపడ్డ అతిపెద్ద ముడి చమురు క్షేత్రానికి హెరాల్డో అధిపతిగా ఉన్నారు.