: చైనా కమ్యూనిస్ట్ పార్టీ రికార్డు లక్ష్యంగా బీజేపీ


2014 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం, మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొన్ని నెలల నుంచి చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో సభ్యత్వ నమోదులో చైనా కమ్యూనిస్టు పార్టీ పేరిట ఉన్న ప్రపంచరికార్డును అధిగమించాలని నిర్ణయించుకుంది. 6.48 కోట్ల సభ్యత్వ నమోదుతో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పుడు దీనిపై కన్నేసిన బీజేపీ మార్చి చివరికల్లా 10 కోట్ల కొత్త సభ్యులను పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది. పార్టీ సభ్యత్వ ప్రచార కమిటీ జాతీయ కన్వీనర్, బీజేపీ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మ మాట్లాడుతూ, గతేడాది నవంబర్ లో ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్చి 31 వరకు జరుగుతుందని, అప్పటికల్లా పదికోట్ల మంది సభ్యులను చేర్చుకోవడమే తమ లక్ష్యమన్నారు.

  • Loading...

More Telugu News