: పరువునష్టం దావా వేసుకోవచ్చు: కరీనాతో వీహెచ్పీ


మహిళల కోసం తాము నిర్వహిస్తున్న మేగజైన్ కవర్ పేజీపై కరీనా కపూర్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రచురించడాన్ని విశ్వహిందూ పరిషత్ సమర్థించుకుంది. "ఈ విషయంలో ఏదైనా సమస్య ఉందని కరీనా కపూర్ భావిస్తే, కోర్టు తలుపులు ఆమె కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి" అని వీహెచ్పీ నేత ప్రకాష్ శర్మ వ్యాఖ్యానించారు. 'లవ్ జిహాద్' అంటూ హిందూ యువతులను ప్రేమిస్తున్నామని చెప్పి పెళ్లి చేసుకొని, అనంతరం మతం మార్చుకునేలా కొందరు ముస్లింలు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ, తాజా సంచికలో ముఖచిత్రంగా కరీనాను చూపింది. కరీనా కపూర్ వివాహం సైఫ్ అలీ ఖాన్ తో జరగ్గా, ఆపై కరీనా తన పేరును కరీనా కపూర్ ఖాన్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ముఖ చిత్రంలో కరీనా సగం ముఖంపై బురఖా ఉన్నట్టు చూపారు. దీనిపై కరీనా మాత్రం ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News