: తెలంగాణలో మరో పర్యటనకు షర్మిల సిద్ధం


తెలంగాణలో వైకాపాను బలోపేతం చేయాలనే కృత నిశ్చయంతో ఆ పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిల ఉన్నారు. తన పర్యటనల ద్వారా తెలంగాణ ప్రజలను తిరిగి వైకాపా పట్ల ఆకర్షితులయ్యేలా ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో, ఈ నెల 21 నుంచి నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఈ యాత్రలో ఆమె పరామర్శిస్తారు. 6 నియోజకవర్గాల్లో 7 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో 32 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల పాదయాత్రను కొనసాగించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News