: అబద్ధాలు చెబుతున్న శశి థరూర్: ఢిల్లీ పోలీస్ చీఫ్


సునందా పుష్కర్ హత్య కేసులో పోలీసులపై శశి థరూర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీ.ఎస్.బస్సీ తెలిపారు. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను పోలీసులు హింసించారని ఆయన రాసిన లేఖను ప్రస్తావిస్తూ, ఈ విషయంలో శశి థరూర్ అబద్ధాలు చెప్పారని వివరించారు. కేసును విచారించిన పోలీసు అధికారులతో మాట్లాడానని, అటువంటి ఘటనలు జరగలేదని వారు స్పష్టం చేశారని బస్సీ పేర్కొన్నారు. కాగా, గత నవంబర్ లో ఢిల్లీ పోలీసు అధికారులకు రాసిన లేఖలో, ఇంటి పని మనిషి నారాయణ్, తను కలసి సునందను హత్య చేసినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తూ, పోలీసులు నారాయణ్ ను కొట్టారని థరూర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News