: "ఆ దయ్యమే నన్ను..." న్యాయమూర్తి ముందు కేకలు పెట్టిన బాధితురాలు


గత నెలలో అత్యాచార యత్నం చేసి పోలీసులకు దొరికిపోయిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్ పై కేసు మరింతగా బిగుసుకుంది. విచారణలో భాగంగా న్యాయమూర్తి ముందు ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించగా బాధిత మహిళ నిందితుడిని గుర్తించింది. "ఆ దయ్యమే నన్ను మానభంగం చేసింది" అంటూ బాధితురాలు కేకలు వేసిందని పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. డిసెంబర్ 5న ఘటన జరుగగా, క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ ను 7వ తేదీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News