: గుండెకు స్వీయ మరమ్మతులు చేసే జన్యువు ఆవిష్కారం
'క్షీరదాలు (పాలిచ్చే జంతువులు) విషయంలో గుండె నిర్మాణంలో ఓ ప్రత్యేకమైన జన్యువు ఉంటుంది. దీన్ని మీస్`1 అంటారు. ఈ తరగతికి చెందిన జీవులు జన్మించిన సమయంలో గుండెలో ఈ జన్యువు పాత్ర అధికంగా ఉంటుంది. ఆ సమయంలో గుండెపోటు వంటివి వచ్చినా కూడా.. అవసరమైన మరమ్మతులు గుండె స్వయంగా చేసుకోగలిగేలా ఈ జన్యువు పనిచేస్తుంది. గుండె కణాలు విభజన అయినప్పుడు.. కొత్తకణాలు ఏర్పడేలా ఈ ఏర్పాటు ఉంటుంది. శిశువు వయసు పెరుగుతున్న కొద్దీ ఈ జన్యు ప్రభావం తగ్గి.. గుండె పునర్నిర్మాణ సామర్థ్యం తగ్గుతుంది' ఇదీ జన్యువు ప్రత్యేకత.
అయితే ఆ సామర్థ్యం ఉన్న జన్యువును గుర్తించడం ద్వారా.. దాన్ని ప్రభావితం చేయడం ద్వారా పెద్దల్లో కూడా గుండెజబ్బులకు చక్కటి చికిత్స చేయవచ్చుననేది అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన. టెక్సాస్ వర్సిటీ సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్ వారు ఈ పరిశోధనల్ని సక్సెస్ఫుల్గా చేసి చూపించారు. ఇది భవిష్యత్తులో గుండె జబ్బుల చికిత్సలో కీలకపాత్ర పోషిస్తుందని అనుకుంటున్నారు.