: ఓటేసిన లంకాధీశుడు... గెలుపుపై ధీమా
శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. మహింద రాజపక్స తన నియోజకవర్గమైన హంబన్ టోటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, విజయంపై ధీమా వ్యక్తం చేశారు. "ఎన్నికల్లో విజయదుందుభి మోగించనున్నాం. ఆ విషయంలో సందేహమే అక్కర్లేదు. రేపటి నుంచి మా మేనిఫెస్టోను అమలుచేస్తాం" అని తెలిపారు. కాగా, సర్కారు నుంచి విడిపోయి ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిన మైత్రిపాల సిరిసేన నుంచి రాజపక్సకు గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఎన్నికల వేడి నేపథ్యంలో, హింసాత్మక ఘటనలకు తావివ్వని రీతిలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని రాజపక్సకు అమెరికా మంత్రి జాన్ కెర్రీ సూచించారు.