: ఒబామాను భయపెడుతున్న ఢిల్లీ... హోటల్ గదులకే పరిమితం!


మరో రెండు వారాల తరువాత భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అత్యధిక సమయం హోటల్ గదులకే పరిమితం కానున్నాడు. ఎక్కువ సేపు బయట తిరిగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒబామాను అంతగా భయపెడుతున్నది ఏంటో తెలుసా?... ఢిల్లీ కాలుష్యం! అమెరికాతో పోలిస్తే ఢిల్లీ గాలులు నాలుగు రెట్ల అధిక కాలుష్యంతో ఉంటాయి. కాలుష్యంపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్న అమెరికా ఎయిర్ క్వాలిటీ అధికారులు, ఎక్కువ సేపు ఒబామా బయట ఉంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News