: గ్రేటర్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం: అమిత్ షా


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం కోసం శ్రమించనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ఆయన కొద్దిసేపటి క్రితం తెలంగాణ కోర్ కమిటీతో భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలకాంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదులో భాగంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది సభ్యులను కొత్తగా పార్టీలోకి తీసుకురానున్నామన్నారు. తెలంగాణలోనే 35 లక్షల మందిని కొత్తగా సభ్యులుగా చేర్చుకుంటామన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు.

  • Loading...

More Telugu News