: హ్యాండ్ బ్యాగులో బుల్లెట్లతో దొరికిపోయిన మహిళ


ముంబై ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికురాలి వద్ద నాలుగు బుల్లెట్లు దొరికాయి. క్యాథే పసిఫిక్ విమానం ద్వారా హాంకాంగ్ వెళ్లేందుకు సిద్ధమైన శ్వేతాలి అద్నాయిక్ అనే మహిళకు చెందిన లగేజీని చెక్ చేస్తుండగా బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు ఆమెను పోలీసులకు అప్పగించారు. దీంతో శ్వేతాలితో పాటు హాంకాంగ్ వెళ్లాల్సిన ఆమె బంధువులు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. 1959 ఆయుధాల చట్టం కింద ఈ ముంబై గృహిణిపై కేసు నమోదు చేశారు. ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసేందుకు యత్నించవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో అలర్ట్ ప్రకటించడం తెలిసిందే. కాగా, శ్వేతాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుల్లెట్ల విషయమై ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News