: మృతులకు లక్ష డాలర్ల చొప్పున పరిహారం ప్రకటించిన ఎయిర్ ఏషియా


గత నెలలో ఎయిర్ ఏషియా విమానం క్యూజడ్ 8501లో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డ ప్రయాణికులకు ఒక్కొక్కరికి లక్ష డాలర్ల (సుమారు రూ.63 లక్షలు) చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు ఎయిర్ ఏషియా తెలిపింది. విమానం తోక భాగాన్ని సముద్ర గర్భం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటకు తీస్తామని ఇండోనేషియా ప్రభుత్వం తెలియజేసింది. విమానం తోకలో ఉండే బ్లాక్ బాక్స్, డేటా రికార్డర్లను వెతికి తీయడమే నేటి తమ ప్రధాన లక్ష్యమని రెస్క్యూ ఆపరేషన్స్ అధికారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News