: సిరీస్ లో నాలుగో సెంచరీ బాదిన కోహ్లీ
ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు. సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో, ఫుల్ ఫామ్ లో ఉన్న విరాట్ మరో సెంచరీ సాధించాడు. 17 ఫోర్ల సాయంతో ఈ సిరీస్ లో నాలుగో సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు, కెప్టెన్ గా మూడో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మొత్తం మీద టెస్టుల్లో కోహ్లీకి ఇది 10వ సెంచరీ. కోహ్లీ బ్యాటింగ్ తో భారత స్కోరు బోర్డు దూసుకుపోతోంది. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 288 పరుగులు. క్రీజ్ మరో ఎండ్ లో కోహ్లీకి తోడుగా అజింక్య రహానే 13 పరుగులతో ఆడుతున్నాడు.