: రెండు దశాబ్దాల తరువాత ఆస్ట్రేలియాలో బద్దలైన రవిశాస్త్రి రికార్డు


ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డు బద్దలైంది. 1992లో రవిశాస్త్రి నెలకొల్పిన రికార్డును రాహుల్ అధిగమించాడు. ఆస్ట్రేలియాలో ఒకే ఇన్నింగ్సులో అత్యధిక బాల్స్ ఆడిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. 23 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై రవిశాస్త్రి 250 బంతులను ఎదుర్కోగా, కే.ఎల్.రాహుల్ 262 బాల్స్ ఆడాడు. కాగా, 13 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 110 పరుగులు చేసి తన తొలి సెంచరీ నమోదు చేసిన రాహుల్ ను స్టార్క్ అవుట్ చేశాడు.

  • Loading...

More Telugu News