: టైర్ల కోసం ఆర్టీసీ బస్సు చోరీ!


హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం అర్ధరాత్రి చోరీకి గురైంది. ఘట్ కేసర్ మండలం ఏదులాబాద్ లో ఆగి ఉన్న బస్సును దుండగులు అపహరించుకుని పోయారు. ఏదులాబాద్ లో నైట్ హాల్ట్ చేయాల్సిన బస్సును రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్ నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారి లేచి చూడగా, బస్సు కనిపించలేదు. దాంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ బస్సును అంకుషాపూర్ లో దుండగులు వదిలివెళ్లినట్టు తెలుస్తోంది. బస్సు రెండు టైర్లను వారు అపహరించారు.

  • Loading...

More Telugu News