: తెలంగాణలో ప్రాంతీయ విభేదాలను లేవనెత్తిన రేవంత్ రెడ్డి


తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా కేసీఆర్ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. ఉత్తర తెలంగాణకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్... దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. రోడ్ల నిధులను ఉత్తర తెలంగాణలో అంతర్భాగమైన మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎక్కువగా కేటాయించి... పెద్ద జిల్లా అయిన మహబూబ్ నగర్ కు తక్కువగా కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి అవసరాల విషయంలోనూ దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. దక్షిణ తెలంగాణ నీటి అవసరాలను పట్టించుకోకుండా... జూరాల-పాకాల పేరుతో నీటిని ఉత్తర తెలంగాణకు తరలించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఇదే జరిగితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News