: ఒబామాను ఇండియాలోకి రానివ్వం: వామపక్షాల హెచ్చరిక


భారత అభివృద్ధిని అడ్డుకుంటున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను దేశంలోకి రానివ్వబోమని సీపీఎం హెచ్చరించింది. ఆయన రాకను నిరసిస్తూ, ఈ నెల 24న ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాదులో కేంద్ర కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. 24న దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలో పార్టీశ్రేణులు విరివిగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీలతోపాటు ఫ్వార్వర్డ్‌ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్, ఎస్‌యుసీఐ పార్టీలు కూడా ఆందోళనల్లో పాల్గొంటాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News