: అయ్యప్ప భక్తుడి ఇంట గ్యాస్ సిలిండర్ పేలుడు... పదమూడు మందికి గాయాలు!


మరో రోజు గడిస్తే ఆ అయ్యప్ప భక్తుడు శబరిమలలో జ్యోతి దర్శనానికి పయనమయ్యేవాడే. అయితే, కొత్తగా కొనుగోలు చేసిన గ్యాస్ సిలిండర్ ఆయనను ఆస్పత్రిలో చేర్చింది. శబరిమల బయలుదేరాల్సిన అయ్యప్ప భక్తుడు ఆస్పత్రి బెడ్డెక్కిన విషాద ఘటన నేటి ఉదయం హైదరాబాద్ నగరం ఎల్బీ నగర్ పరిధిలోని భరత్ నగర్ లో చోటుచేసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన గ్యాస్ సిలిండర్ నుంచి లీకవుతున్న గ్యాస్ ను పసిగట్టడంలో విఫలమైన అయ్యప్ప భక్తుడు ఎల్లేశ్ కుటుంబం గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్ర గాయాలపాలైంది. అంతేకాక వారి పక్కనున్న ఇంటి వారు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది గాయాలపాలయ్యారు.

  • Loading...

More Telugu News