: ఢిల్లీ-లాహోర్ 'దోస్తీ' బస్సును నిలిపివేయండి: పాకిస్థాన్
గత 16 ఏళ్లుగా ఢిల్లీ, లాహోర్ ల మధ్య నడుస్తున్న 'దోస్తీ' బస్సును నిలిపివేయాలని పాక్ ప్రభుత్వం భారత్ ను కోరింది. ఉగ్రదాడుల హెచ్చరికలు ఎక్కువైన నేపథ్యంలో బస్సు రాకపోకలను నిలిపివేద్దామని విన్నవించింది. దోస్తీ బస్సు భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన వాఘా వరకే వస్తుందని... అక్కడి నుంచి లాహోర్ రావాలంటే పాక్ భూభాగంలో మరో బస్సులో ప్రయాణించాల్సి ఉంటుందని... ఇది క్షేమకరం కాదని పాక్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ తెలిపింది. పాకిస్థాన్ కు ఉగ్రవాదులు పలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో, ఈ బస్సు ప్రయాణం అంత సురక్షితం కాదని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాక్ వెల్లడించింది. పెషావర్ లోని స్కూల్ పై ఉగ్ర దాడి జరిగిన అనంతరం పాక్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.