: విదేశీ తెలుగు ప్రజలకు గరుడ వేగ, గరుడ బజార్ ఆఫర్లు
విదేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజలకు 'గరుడ' సంస్థ ఆఫర్లు ప్రకటించింది. సంక్రాంతిని ప్రతి లోగిలిలో ఘనంగా జరుపుకునే తెలుగు ప్రజలు, ఎక్కడున్నా ఆ సంప్రదాయాన్ని వీడరు. ఈ నేపథ్యంలో గరుడ సేవలను ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని, గరుడ బజార్ లో ఉత్పత్తుల మీద 5%, గరుడ వేగ షిప్ మెంట్ల మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా జారీ చేసిన ప్రకటనలో తమ సేవల నాణ్యతకు ఇదే సిసలైన నిదర్శనమని పేర్కొన్నారు. వినియోగదారులు చూపుతున్న నమ్మకం, ఆదరణ కారణంగానే ఐదేళ్ల ప్రయాణం సాధ్యమైందని గురుడ తెలిపింది. అందుకు కృతజ్ఞతగా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల నుంచి గరుడవేగ ద్వారా 5 కిలోలు, అంతకంటే ఎక్కువగా చేసే షిప్ మెంట్లకు ఈనెల 20వ తేదీ వరకు 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని వెల్లడించింది. సంక్రాంతికి విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు స్వగృహాల నుంచి రుచికరమైన స్వీట్లు తెప్పించుకుంటారు. వాటితో పాటు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ గాజులు, ప్రత్యేకమైన స్వీట్లు కూడా విక్రయిస్తున్నామని, వాటిమీద 5% డిస్కౌంట్ కూడా ఇస్తున్నామని వారు వివరించారు.