: పురందేశ్వరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: టీడీపీ నేత వర్ల


కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను టీడీపీ తప్పుబట్టింది. ఆమెకు ఇంకా కాంగ్రెస్ వాసన పోలేదని ఆ పార్టీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పురందేశ్వరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆమెకు ఎన్టీఆర్ కుమార్తెగానే గుర్తింపు ఉందని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించడం పురందేశ్వరికి సరికాదని సూచించారు. అయితే, ఐదేళ్లపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు.

  • Loading...

More Telugu News