: వరల్డ్ కప్ కు జట్టును ప్రకటించిన పాకిస్థాన్
వచ్చే నెలలో వరల్డ్ కప్ పోటీలు ఆరంభం కానుండడంతో ఆయా దేశాలు జట్లను ప్రకటిస్తున్నాయి. మొత్తం 15 మందితో పాక్ సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. వెటరన్ బ్యాట్స్ మన్ మిస్బావుల్ హక్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. కొంతకాలం క్రితం జట్టులో చోటు కోల్పోయిన ఫాస్ట్ బౌలర్ సొహయిల్ ఖాన్ ను వరల్డ్ కప్ కు ఎంపిక చేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ ఉందంటూ ఐసీసీ సస్పెండ్ చేసిన మహ్మద్ హఫీజ్ ను స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా జట్టులోకి తీసుకున్నారు. ఇక, స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి బ్యాకప్ రూపంలో లెగ్ స్పిన్నర్ యాసిర్ షా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. పాక్ జట్టులో ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు ఉండడం విశేషం. జట్టు సభ్యులు మిస్బావుల్ హక్ (కెప్టెన్), హరీస్ సొహయిల్, యూనస్ ఖాన్, ఉమర్ అక్మల్, సొహైబ్ మక్సూద్, సర్ఫ్రాజ్ అహ్మద్, షాహిద్ అఫ్రిది, యాసిర్ షా, మహ్మద్ ఇర్ఫాన్, జునైద్ ఖాన్, ఎహ్సాన్ అదిల్, సొహయిల్ ఖాన్, వాహబ్ రియాజ్, అహ్మద్ షేజాద్, మహ్మద్ హఫీజ్.