: ఈ నెలలోనే నటి త్రిషకు నిశ్చితార్థం
అందాల భామ త్రిష తమిళ సినీ నిర్మాత వరుణ్ మణియన్ ను పెళ్లి చేసుకోబోతోంది. ఈ నెల 23న వారిద్దరూ నిశ్చితార్థం చేసుకోనున్నట్టు తనే ట్విట్టర్ లో స్వయంగా ప్రకటించింది. ఇది కేవలం తన కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే ఓ ప్రైవేట్ కార్యక్రమమని వెల్లడించింది. అయితే, తన పెళ్లి తేదీ గురించి ఎలాంటి ప్రచారం చేయవద్దని, ఇంకా తాము ఖరారు చేయలేదని చెప్పింది. వివాహం ఎప్పుడనేది తానే స్వయంగా చెబుతానని త్రిష అభిమానులనుద్దేశించి పేర్కొంది. సినిమాల నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని, త్వరలో రెండు సినిమాలను ఒప్పుకోనున్నానని వివరించింది. ఈ ఏడాది నాలుగు చిత్రాలు రిలీజ్ అవ్వనున్నట్టు త్రిష తెలిపింది. కొంతకాలం నుంచి వరుణ్ మణియన్ కు, తనకు మధ్య సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ వాస్తవం కాదని త్రిష ఖండిస్తూ వచ్చింది. తాజాగా తమ రిలేషన్ నిజమేనని తనే వెల్లడించడం విశేషం.