: నా వారసుడు స్టాలినే... పార్టీ అధ్యక్ష పదవి ఇప్పుడే కాదు: కరుణానిధి
తన రాజకీయ వారసుడు స్టాలిన్ మాత్రమేనని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరోసారి స్పష్టం చేశారు. అయితే, పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు మరికొంత కాలం ఆగక తప్పదన్న సంకేతాలు కరుణ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో, రెండు రోజుల్లో జరిగే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో స్టాలిన్ కు అవకాశం లేదని స్పష్టమైంది. డీఎంకేకు 12వ సారి అధ్యక్షుడిగా కరుణానిధి ఎంపిక శుక్రవారం నాడు లాంఛనంగా జరగనుంది. స్టాలిన్ మరోసారి పార్టీ కార్యదర్శిగా కొనసాగనున్నారు. తాను అధ్యక్ష పదవికి తొందర పడుతున్నట్టు వచ్చిన వార్తలను స్టాలిన్ ఖండించారు. గత సంవత్సరం మేలో జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఒక్క ఎంపీ స్థానంలో కూడా విజయం సాధించలేదన్న సంగతి తెలిసిందే.