: దాడి చేస్తామంటూ ముంబయి ఎయిర్ పోర్ట్ వద్ద ఐఎస్ఐఎస్ నోట్


దాడి చేస్తామంటూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు పెట్టిన ఓ నోట్ తో భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2లోని లెవల్ 2 టాయిలెట్ లో గోడకు చేతితో రాసిన ఓ లేఖ లభ్యమైంది. అందులో ఈ నెల 10న దాడి చేయవచ్చని రాసినట్టు చెబుతున్నారు. "ఎటాక్ బై ఐఎస్ఐఎస్ డేట్ 10/01/15" అని రాసి ఉందని చెప్పారు. దాంతో ఎయిర్ పోర్టులో భద్రత చూస్తున్న సీఐఎస్ఎఫ్ పోలీసులు అనుమానితులను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజ్ ను తనిఖీ చేస్తున్నారు. అంతేగాక ఎయిర్ పోర్టు సిబ్బందిని కూడి విచారిస్తున్నారు. అటు ఈ విషయాన్ని ముంబయి పోలీసులకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News