: సునంద హత్య కేసులో శశి థరూర్ నూ విచారిస్తాం: ఢిల్లీ పోలీసులు
సునందా పుష్కర్ హత్యకేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ను విచారిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీ.ఎస్.బస్సీ తెలిపారు. ఆమెది హత్యేనని నిన్న పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసు విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక బృందం నేడు రంగంలోకి దిగింది. ఎఫ్‌ఐఆర్ లో ఎవరినీ అనుమానితులుగా పేర్కొనలేదని స్పష్టం చేసిన బస్సీ, కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నిస్తామని తెలిపారు. కేసు మూలాల నుంచీ దర్యాప్తును ప్రారంభించనున్నట్టు వివరించారు. సునంద విషప్రయోగం వల్ల మరణించారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో హత్యకేసు నమోదైంది.