: ‘పీకే’కు ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్


‘పీకే’ సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని, ఆ చిత్రాన్ని నిషేధించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు నేడు స్పష్టం చేసింది. బాలీవుడ్ స్టార్ అమీర్‌ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాలో హిందూ దేవుళ్లను, హిందువుల నమ్మకాలను, మనో భావాలను దెబ్బతీసే విధంగా పలు సన్నివేశాలున్నాయని ఓ వ్యక్తి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన చీఫ్ జస్టిస్ రోహిణీ, జస్టిస్ ఆర్‌.ఎస్.యెండ్లాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పిచ్చింది. ఈ చిత్రాన్ని నిషేధించాలని కొందరు వాదిస్తుండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారత సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను నమోదు చేసిన చిత్రంగా ఇప్పటికే నిలిచింది.

  • Loading...

More Telugu News