: ఆస్ట్రేలియా బ్రూవరీ కండకావరం... బీరు సీసాలపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు


ఆస్ట్రేలియాకు చెందిన బ్రూక్ వేల్ యూనియన్ బ్రూవరీ తీరు మార్చుకోలేదు. 2013లో హిందూ దేవుళ్ల బొమ్మలను బీరు బాటిళ్లపై ముద్రించిన ఈ మద్యం తయారీ కంపెనీ ఆ తర్వాత ఎదురైన వ్యతిరేకత నేపథ్యంలో క్షమాపణలు చెప్పింది. అయితే, లక్ష్మీదేవి, గణేశుడు తదితరుల బొమ్మలను ముద్రించిన బీరు సీసాల విక్రయాన్ని మాత్రం కొనసాగిస్తోంది. అప్పట్లో ఈ కంపెనీకి వ్యతిరేకంగా యూనివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం అధ్యక్షుడు రాజన్ జేడ్ దీనిపై ఆందోళన చేపట్టారు. దీంతో, బ్రూక్ వేల్ యూనియన్ హిందూ సమాజానికి క్షమాపణ తెలిపింది. ఆ కంపెనీ తీరు మార్చుకోకపోవడంపై ఆయన తాజాగా స్పందించారు. అమెరికాలోని నెవాడా నుంచి ఓ ప్రకటన చేశారు. హిందూ దేవుళ్లను, మత చిహ్నాలను దుర్వినియోగపర్చడం భక్తుల మనోభావాలను గాయపరుస్తుందని అన్నారు. లక్ష్మీదేవి, గణేశుడు భారత్ లో విశేషంగా పూజలందుకుంటారని, అలాంటి వారిని ఆలయాల్లో పెట్టి ఆరాధించాలేగానీ, డబ్బు కోసం బీరు సీసాలపై ముద్రించడం సరికాదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News