: బ్రూక్లిన్ టీషర్టులో ఒబామా కూతురు... నెట్ లో హల్ చల్ చేస్తున్న ఫొటో
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కూతురు మలియా ఒబామా (16) ఫొటో ఇంటర్నెట్ లో హల్ చల్ సృష్టిస్తోంది. బ్రూక్లిన్ టీ షర్టు ధరించిన మలియా, పోనీటెయిల్ హెయిర్ తో విలాసంగా పోజిచ్చినట్లు సదరు ఫొటోలో కనిపిస్తోంది. అయితే ఈ ఫొటో ఎవరు? ఎక్కడ తీశారు? అన్న వివరాలు తెలియరాలేదు. అసలు సదరు ఫొటోను ఇంటర్నెట్ లో ఎవరు పెట్టారన్న విషయంపై కూడా స్పష్టత లేదు. ఈ తరహా వివాదాలపై అత్యంత వేగంగా స్పందించే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా ఇప్పటిదాకా ఈ ఫొటోపై స్పందించలేదు.