: మడకశిరకు వైఎస్ జగన్... బాధితులకు పరామర్శ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి మధ్యాహ్నం అనంతపురం జిల్లా మడకశిరకు వెళ్లనున్నారు. మడకశిర నుంచి పెనుగొండ వెళుతున్న ఆర్టీసీ బస్సు లోయలో పడి 14 మంది మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే. ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్ ఉన్నపళంగా అనంతపురం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలపడంతో పాటు గాయపడ్డవారిని పరామర్శించనున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని జగన్ కొద్దిసేపటి క్రితం డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే... పార్టీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.