: రెండు రోజుల్లో మూడున్నర లక్షల కోట్లు ఆవిరి... కోలుకోని స్టాక్ మార్కెట్లు


స్టాక్ మార్కెట్ల నష్టం కొనసాగుతూనే ఉంది. కొత్తగా షేర్లు కొనే బదులు ఉన్నవి అమ్ముకుంటేనే మంచిదని ఇన్వెస్టర్లు భావిస్తుండటంతో నేటి సెషన్ సైతం నష్టాల్లో సాగుతోంది. నిన్న 3 శాతం పడిపోయిన స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ఉదయం 12 గంటల సమయానికి మరో అర శాతానికి పైగా దిగజారాయి. దీంతో రెండు రోజుల వ్యవధిలో రూ.3.5 లక్షల కోట్ల రూపాయల మేరకు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. కాగా, కడపటి వార్తలు అందేసరికి సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంలో ఉంది. నిన్నటి భారీ పతనం అనంతరం సూచీలు తదుపరి సెషన్ లలో కొంత తేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News