: గాడిదలకు సన్మానం చేసిన కర్నాటక నేత


ఎంతో కాలంగా కష్టించి పనిచేస్తూ, యజమానికి విశ్వాసంగా ఉన్న రెండు గాడిదలను కర్నాటకలోని ఓ ప్రాంతీయ పార్టీ నేత ఘనంగా సత్కరించారు. బెంగళూరు ప్రధాన బస్టాండులో ప్రయాణికులంతా చూస్తుండగా 'కన్నడ చాలువలి వతల్ పక్ష' పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ గాడిదలకు పూల దండలు వేసి, శాలువాలు కప్పి 'రాజ్యోత్సవ' అవార్డులను ఇచ్చారు. ప్రజలకు సేవలందిస్తున్న ఆవులు, కుక్కలు తదితరాలను ప్రతినెలా ఇలానే సత్కరిస్తానని అంటున్నాడీ మాజీ ఎంఎల్ఏ. కాగా, కర్నాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ 1న ప్రముఖులకు 'రాజ్యోత్సవ' పేరిట అవార్డులను అందిస్తోంది.

  • Loading...

More Telugu News