: రైలు పట్టాలపై ప్రేమజంట ఆత్మహత్య!
కలసి జీవించలేము అనుకున్నారో ఏమో... కనీసం కలసి మరణించాలని ఆ జంట నిర్ణయించుకుంది. సికింద్రాబాద్‌లోని ఆల్వాల్ రైతుబజార్ వద్ద గల రైల్వేట్రాక్ పై వేగంగా వస్తున్న రైలు కింద పడి వీరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఎవరు? వీరి పేర్లేమిటి? అన్న వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుల వివరాల కోసం విచారణ చేపట్టారు. వీరి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.