: తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా


సిడ్నీలో భారత్ తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఏడు వికెట్ల నష్టానికి 572 పరుగుల స్కోరు సాధించిన ఆసీస్, తొలి ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో రోజర్స్ 95, వార్నర్ 101, వాట్సన్ 81, స్మిత్ 117, మార్ష్ 73, బర్న్స్ 58, హ్యారిస్ 25, హాడిన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను నిలువరించేందుకు టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ, విఫలమయ్యారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 5 వికెట్లను కూల్చగా, ఉమేష్ యాదవ్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఈ రోజు ఆటలో మరో 25 ఓవర్లు మిగిలి ఉన్నాయి. మురళీ విజయ్, లోకేష్ రాహుల్ లు భారత తొలి ఇన్నింగ్సును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News