: శంషాబాద్ లో అత్యవసరంగా దిగిన ఎయిరిండియా విమానం


మస్కట్ నుంచి చెన్నై వస్తున్న ఎయిరిండియా విమానం ఈ ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నైలో దట్టమైన పొగమంచు కారణంగా ఈ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి తోడు వెలుతురు సరిగా లేకపోవడంతో, విమానానికి ఏదైనా ప్రమాదం జరగవచ్చని భావించి కిందకు దించినట్టు అధికారులు తెలిపారు. చెన్నై ప్రయాణికులను సాధ్యమైనంత త్వరలో గమ్యస్థానానికి చేరుస్తామని వివరించారు. కాగా, ఈ ఉదయం శంషాబాద్ నుంచి చెన్నై వెళ్ళాల్సిన విమానాలు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News