: శ్రీహరికోటకు ఉగ్ర ముప్పు... హై అలర్ట్!
తప్పించుకున్న సిమీ ఉగ్రవాదులు శ్రీహరికోటలోని రాకెట్ లాంచ్ స్టేషన్ పై దాడులకు పాల్పడవచ్చన్న సమాచారంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేడు పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితులు తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందిన సంగతి తెలిసిందే. తప్పించుకున్న ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ ఉద్దు ఫొటోలను తమిళనాడు పోలీసులు ఇప్పటికే తడ పోలీసులకు పంపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.