: నెల్లూరు జిల్లా తడలో సిమీ ఉగ్రవాదులు... ఏపీ, తమిళనాడు పోలీసుల జల్లెడ
నెల్లూరు జిల్లా తడలో నిషేధిత సిమీ ఉగ్రవాదులున్నారన్న వార్తల నేపథ్యంలో నేటి ఉదయం కలకలం రేగింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ పోలీసులతో పాటు తమిళనాడు పోలీసులు తడలో భారీ సంఖ్యలో మోహరించారు. అణువణువునా తనిఖీలు చేస్తున్న ఇరు రాష్ట్రాల పోలీసులు తడలో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. నిన్నటికి నిన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో నేవీ చీఫ్ భేటీ నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతుండటం గమనార్హం. సిమీకి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తడలో మకాం వేశారని నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినట్లు సమాచారం.