: పుట్టిన ప్రతి వ్యక్తి ముస్లిమే... క్షమాపణ చెప్పను: అసదుద్దీన్ ఒవైసీ


జన్మించిన ప్రతి శిశువు ముస్లిమే అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని అసద్ తెలిపారు. ప్రతి వాడు ముస్లింగానే పుడుతున్నాడని... కాకపోతే వారి తల్లిదండ్రులు, సమాజం వారిని ఇతర మతాల్లోకి చేర్చుతున్నాయని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణలు చెప్పనని స్పష్టం చేశారు. భారత్ లో పుట్టిన వారంతా హిందువులే అని విశ్వ హిందూ పరిషత్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, అసదుద్దీన్ ఈ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News