: హైదరాబాద్ స్కూళ్లలో సెల్ ఫోన్ల నిషేధం: ఉత్తర్వులు జారీ చేసిన టీఎస్ సర్కారు
హైదరాబాద్ లోని పాఠశాల ఆవరణలో మొబైల్ ఫోన్ల వినియోగంపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల ఆవరణలోకి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా సెల్ ఫోన్లను తీసుకురావడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రవాదం విస్తరణ, బాలికలపై లైంగిక వేధింపులు తదితరాలను అదుపులో ఉంచడంతో పాటు మెరుగైన ఫలితాలను రాబట్టే క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.