: సినీ నటుడు నరేష్ ఇంట్లో పేలిన సిలిండర్... ఎగసిపడ్డ జ్వాలలు


ప్రముఖ సినీ నటుడు నరేష్ ఇంట్లో ప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా హిందూపురం నగరం డీఆర్ కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదం కారణంగా, ఇంట్లోని కరెంట్ వైర్లు, ఫర్నిచర్ కాలిపోయాయి, అద్దాలు పగిలిపోయాయి. హుటాహుటీన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇంట్లోని 5 కిలోల గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఘటన జరిగిన సమయంలో నరేష్ భార్య రమ్య, అత్త, మరదలు మేడపైన గదిలో ఉన్నారు. దీంతో, వారు సురక్షితంగా బయటపడ్డారు. నరేష్ మాత్రం ప్రమాద సమయంలో ఇంట్లో లేరు. నరేష్ ఇంట్లో ప్రమాదం జరిగిందని తెలుసుకున్న హిందూపురం వాసులు, పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News