: మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్... నాలుగొందల మార్కు దాటిన స్కోరు
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి, నాలుగో టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆటలో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 400 మార్కు చేరుకోగానే ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్(81) మొహ్మద్ షమీ బౌలింగులో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (113) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా శతకం సాధించడంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం స్మిత్ కు జత కలిసిన షాన్ మార్ష్ (7) ఆసీస్ బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నాడు. 110 ఓవర్లలో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 409 పరుగులు చేసింది.