: పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయండి: బాంబే హైకోర్టు ఆదేశం
మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని బాంబే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఆగస్టులో మహారాష్ట్రలో పోలీస్ స్టేషన్లలో జరిగిన లాకప్ డెత్ ల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కొందరు న్యాయవాదులు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తక్షణం సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేశారని, అన్ని పోలీస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది మంకువార్ దేశ్ ముఖ్ న్యాయస్థానానికి తెలిపారు.