: ఆయన పక్కన కూర్చునే అర్హత కూడా నాకు లేదు: అమితాబ్
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థిని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కలిశారు. ముంబైలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశానికి ముఖ్య అతిథులుగా సత్యార్థి, అమితాబ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ మాట్లాడుతూ, కైలాశ్ సత్యార్థి లాంటి గొప్ప వ్యక్తితో వేదిక పంచుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఆయన లాంటి వ్యక్తి పక్కన కూర్చునేందుకు కూడా తనకు అర్హత లేదని అమితాబ్ పేర్కొన్నారు.