: గద్వాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ బాహాబాహీ


గద్వాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికలు జరిగిన నాటి నుంచి గద్వాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో గద్వాలలోని రమ్య ఇండస్ట్రీస్ పై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దాడులు నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు పరిశ్రమలోకి అడుగుపెట్టడాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్-టీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణగా మారింది. ఈ ఘర్షణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News